శ్రీకాళహస్తి ఆలయంలో నిన్న ఆదివారం(25-02-2024) రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారు,మరియు తొండమాన్ చక్రవర్తి ల దోపు ఉత్సవం (చోరు ఉత్సవము) నాలుగు మాడ వీధుల్లో ఘనంగా నిర్వహించారు.
#srikalahasti #srikalahastikshetram #srikalahastitemple #శ్రీకాళహస్తి #skht #శ్రీకాళహస్తిక్షేత్రం #lordshiva #srikalahastiupdates #viral #tirupati
Tuesday, February 27, 2024
శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం
శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం
కళ్యాణం..కమనీయం..
శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి నిత్య కళ్యాణం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు సోమవారం(26-02-2024) శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఉత్సవ మూర్తి విగ్రహాలను పలు రకాల పుష్పాలతో శుభోదయం అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు.
వేద పండితులు కలశ ప్రతిష్ఠ చేసి గణపతి పూజ,కలశ పూజ,నవగ్రహ పూజ,కంకణ ధారణ పూజ, యజ్ఞోపవేత పూజ, మాంగళ్య పూజను, వైభవంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తదుపరి వేదపండితులు వేదమంత్రాల మధ్య మంగళ వాయిద్యాలు నడుమ ఓం నమశివాయ నామస్మరణ మధ్య శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు మరియు ఆలయ అధికారులు సిబ్బంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. #srikalahasti #srikalahastikshetram #srikalahastitemple #శ్రీకాళహస్తి #skht #శ్రీకాళహస్తిక్షేత్రం #lordshiva #srikalahastiupdates
Subscribe to:
Posts (Atom)